ఓల్డ్ ఏజ్ హోంలో మద్యం, గంజాయి బానిసలు

ఓల్డ్ ఏజ్ హోంలో మద్యం, గంజాయి బానిసలు

కీసర: పేరుకే అది ఓల్డ్ ఏజ్ హోం .. అక్కడ ఉండేది వృద్ధులు మాత్రమే కాదు.. మానసిక రోగులు, మద్యం, గంజాయి బానిసలు. వీరందరినీ ఒకే దగ్గర ఉంచుతున్నారు. మద్యం, గంజాయికి అలవాటుపడ్డ వ్యక్తులకు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించకుండా వారి తల్లిదండ్రులే నిర్వాహకులకు డబ్బులు ఇచ్చి ఆ ఓల్డ్ ఏజ్ హోంలో చేరుస్తున్నారు. మానసిక రోగులను సైతం వారి కుటుంబీకులే అక్కడ చేర్పిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పారిపోవాలని చూస్తే వారిని గొలుసులతో బంధిస్తున్నారు. ఇల్లీగల్ రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతున్న మమత ఓల్డ్ ఏజ్ నిర్వాహకులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేందర్ గౌడ్ వివరాలు చెప్పారు. మండల పరిధిలోని నాగారంలో శిల్పానగర్ కాలనీలోని మమత ఓల్డ్ ఏజ్ హోంను మొదట ఇండిపెండెంట్ బిల్డింగ్ లో వృద్ధుల కోసం ప్రారంభించారు. ఆ తర్వాత అందులో డబ్బులు తీసుకుని మానసిక రోగులను చేర్పించు కోవడం మొదలుపెట్టారు.

క్రమంగా మద్యం, గంజాయికి బానిసైన వాళ్లను కూడా చేర్పించుకున్నారు. అందరినీ ఒకే దగ్గర ఉంచారు. బుధవారం రాత్రి ఓల్డ్ ఏజ్ హోంలో ఉండే మానసిక రోగులు మమ్మల్ని కాపాడండి అంటూ అరవడంతో స్థానికులు డయల్ 100కి కాల్ చేశారు. పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్నది వృద్ధులు కాదని.. మానసిక రోగులని నిర్ధారణకు వచ్చారు. మరికొందరు మద్యానికి,గంజాయికి అలవాటుపడ్డ వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. గురువారం ఓల్డ్ఏజ్ హోంకి సంబంధించి మానసిక రోగుల అరుపులు, ఓ మహిళను గొలుసుతో కట్టేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక తహసీల్దార్ నాగరాజు మమత ఓల్డ్ఏజ్ హోంను పరిశీలిం చారు.

రెండు ఇరుకైన గదుల్లో 63 మంది పురుషులు,22 మంది మహిళలుక లిపి 85 మంది ఉన్నట్టు ఆయన తెలిపారు. గురువారం రాత్రి మమత ఓల్డ్ఏజ్ హోం ను సందర్శించిన మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి అక్కడ మానసిక రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో వృద్ధులను కాకుండా ఇలా మానసిక రోగులు, మద్యం ,గంజాయికి బానిసై వారిని చేర్చుకుని అందరినీ ఒకే దగ్గర ఉంచడం సరికాదని ఆమె చెప్పారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకులు జాన్ రతన్ పాల్, కె,భారతితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మమత ఓల్డ్ఏజ్ హోంలో వృద్ధులను శుక్రవారం వేరే ఓల్డ్ ఏజ్ హోంకి, మానసిక రోగులను రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలిస్తామన్నారు.

see also: గుర్రమెక్కిన పెళ్లి కూతుళ్లు

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్

న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..