ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ట్రేడింగ్, షేర్ మార్కెట్, తక్కువ టైమ్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. అధిక లాభాల ఆశచూపి ఓ వ్యక్తికి రూ. 53 లక్షలు టోకరా పెట్టాడు మోసగాడు.
మేడి శిల్వకుమార్ అనే వ్యక్తి.. శాలీనీ ఎంటరైప్రైజెస్ పేరుతో భారీ మొత్తంలో స్క్రాప్ షాప్ బిజినెస్ చేస్తున్నాడు. దూలపల్లికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి పలు ధపాలుగా రూ. 53లక్షలు కాజేశాడు. ఈ ఘటనపై ప్రభాకర్ తో పాటు దూలపల్లికి చెందిన మిధున్ రాజ్ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు శిల్వకుమార్ పై ఇప్పటికే సురారం పీఎస్ లో సైతం పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఆన్‌లైన్ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు, కార్పొరేట్ కంపెనీలు సహా వ్యాపారవేత్తలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం మంది బాధితులు విద్యా వంతులే ఉంటున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన వాళ్లే ఉంటున్నారు.ఈ ఏడాది నమోదైన సైబర్ నేరాల్లో బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి
