
హన్మకొండ సిటీ, వెలుగు: మద్యం మత్తులో ముగ్గురి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఈ సంఘటన హన్మకొండ కొత్త బస్టాండ్ సమీపంలోని కుడా కాంప్లె క్స్ లో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్డౌన్ తో పనులు లేకపోవడంతో కొందరు యువకులు కుడా కాంప్లె క్స్ రెండో అంతస్తులో కొంతకాలంగా పేకాడుతున్నారు. బుధవారం వైన్ షాపులు ఓపెన్ కావడంతో మందు తెచ్చుకుని తాగుతూ పేకాడారు.
తాగిన మైకంలో రమేష్, నాగరాజు(45), మరో వ్యక్తి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరగడంతో నాగరాజును రమేష్ బిల్డింగ్ పై నుంచి నెట్టివేయడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పేకాట ఆడేవాళ్లలో కొందరు నెల్లూరుకు చెందినవారు కాగా, రమేష్ జనగామ జిల్లా పాలకుర్తికి చెందినవాడిగా తెలుస్తోంది.