మద్యం అక్రమ తరలింపు వివాదం.. ఎస్ఐ సస్పెండ్

మద్యం అక్రమ తరలింపు వివాదం.. ఎస్ఐ సస్పెండ్
  • ఏపీకి మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుపడ్డ కానిస్టేబుల్ 
  • బాధ్యునిగా ఎస్ఐ విజయకుమార్ సస్పెండ్

నల్గొండ జిల్లా: దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ పై సప్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐజి ఆదేశాలు జారీ చేశారు. పోలీసు పెట్రోలింగ్ వాహనాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రకు అక్రమంగా మద్యం తరలింపు వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. పెట్రోలింగ్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తెలంగాణ నుండి మద్యం కాటన్స్  ఆంధ్రకు తరలిస్తుండగా ఏపీ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసుల గస్తీ వాహనాన్ని ఉపయోగించుకుని అక్రమంగా మద్యం తరలిస్తూ కానిస్టేబుట్ పట్టుబడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు శాఖలో కలకలం రేపింది. ఎస్ఐ సహకారం లేకుండా ఇలాంటివి జరిగి అవకాశం లేదని భావించిన ఐజీ.. కానిస్టేబుల్ అక్రమ మద్యం తరలింపు విషయంలో ఎస్ఐ విజయ్ కుమార్ ని బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.