
సీతాఫల్ మండి, వెలుగు: మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబంలో గొడవలకారణంగా సూసైడ్ కు పాల్పడ్డాడు. తుకారం గేట్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎ. ఆంజనేయులు తెలిపిన ప్రకారం... అడ్డగుట్ట ఏ సెక్షన్ లో ఉండే అశోక్ (34), కూలి పని చేస్తుంటాడు. కొంత కాలంగా మద్యానికి బానిసగా మారాడు.
Also Rard: సమయం లేదు గెలుపు కోసం కలిసి కష్టపడండి: సోనియా
ఇంట్లోని వస్తువులు తీసుకెళ్లి అమ్ముకుని వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుండగా.. ఆదివారం దంపతులు గొడవపడ్డారు. అనంతరం పనికి వెళ్లి భార్య ఇంటికి వచ్చి చూసే సరికి అశోక్ ఉరేసుకొని చనిపోయి కనిపించాడు. వెంటనే భార్య రూప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.