
- గ్రామాలు, వార్డుల్లో 106 మెడికల్‌క్యాంపులు ఏర్పాటు
- పీహెచ్‌సీలు, హాస్పిటల్స్‌లో అందుబాటులో మందులు
- 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్ కేసులు
- జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
- ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెంగ్యూ పేరిట భయపెడితే చర్యలు
- మంచిర్యాల డీఎంహెచ్‌వో హరీశ్ రాజ్
మంచిర్యాల, వెలుగు: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అలర్ట్అయ్యిందని మంచిర్యాల డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్రాజ్అన్నారు. డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, జ్వరాలను కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ఎప్పటికప్పుడు టాస్క్‌ఫోర్స్‌కమిటీ మీటింగ్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
పీహెచ్‌సీలు, హాస్పిటల్స్‌లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.డీఎంహెచ్‌వో చెప్పిన విషయాలు ఇవీ..
ఇంటింటి సర్వే, మెడికల్ క్యాంపులు
వర్షాకాలం ప్రారంభం నుంచే జిల్లాలో ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. జ్వరపీడితులు ఉంటే ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేస్తున్నాం. సాధారణ జ్వరాలైతే మందులు ఇస్తున్నాం. డెంగ్యూ, మలేరియాగా అనుమానముంటే బ్లడ్ శాంపిల్స్ సేకరించి టీ హబ్‌లో టెస్టులు చేస్తున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 106 మెడికల్ క్యాంపులు నిర్వహించాం. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్, 897 డయేరియా, 5,930 అన్నోన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 8,150 ఓపీ కేసుల్లో 62 మాత్రమే ఫీవర్ కేసులు నమోదయ్యాయి.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెంగ్యూ టెస్టులు లేవు
వాతావరణ మార్పుల కారణంగా సాధారణ జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి కామన్. వాటికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, హాస్పిటల్స్‌లో టెస్టింగ్ కిట్లు, అవసరమైన మందులు స్టాక్ఉన్నాయి.
కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జ్వర బాధితులకు ప్లేట్లెట్స్ తగ్గితే డెంగ్యూ అని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెంగ్యూ టెస్టులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఎలీసా టెస్టు ద్వారా డెంగ్యూ నిర్ధారణ జరుగుతుంది. ప్రైవేట్ఆస్పత్రుల్లో డెంగ్యూ పేరిట పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తే యాక్షన్ తీసుకుంటాం.
జీజీహెచ్‌లో పీవర్ వార్డు
జ్వర బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మంచిర్యాల గవర్నమెంట్జనరల్ హాస్పిటల్లో 20 బెడ్స్‌తో ఫీవర్ వార్డును ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్యం స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్ అందుబాటులో ఉంటారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి కేసులకు మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్రజలు జ్వరం రాగానే ప్రైవేట్ హాస్పిటల్స్‌కు పరుగెత్తాల్సిన అవసరం లేదు.
రెసిడెన్షియల్స్కూళ్లలో..
జిల్లాలోని 116 రెసిడెన్షియల్ స్కూళ్లలో సీజనల్వ్యాధులు, అంటురోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియజేస్తున్నాం. దోమల నివారణ, మెరుగైన శానిటేషన్ చర్యలతో వ్యాధులను కంట్రోల్చేయవచ్చు.
ప్రజలు అలర్ట్‌గా ఉండాలి
సీజనల్ వ్యాధులు, అంటురోగాల వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అలాగే శానిటేషన్‌పై పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలకు, మున్సిపల్ కమిషనర్లకు అవసరమైన సూచనలు చేశాం.
దోమల నివారణకు ఫాగింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయిస్తుండడంతో ఈసారి జ్వరాల తీవ్రత అంతగా లేదు. డెంగ్యూ కేసులు నిరుటికంటే తగ్గాయి. గతేడాది ఇదే టైమ్‌కు 230 డెంగ్యూ కేసులు నమోదైతే ఈసారి 74 కేసులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో మరణాలు నమోదు కాలేదు.