ఆ పని ఇంకా పూర్తి చేయలేదా? ఐతే మీ బ్యాంక్ లాకర్ సీజ్ అవ్వొచ్చు తెలుసా..!

ఆ పని ఇంకా పూర్తి చేయలేదా? ఐతే మీ బ్యాంక్ లాకర్ సీజ్ అవ్వొచ్చు తెలుసా..!

Bank Locker Rules: నేటి కాలంలో బ్యాంకులో లాకర్ కలిగి ఉండటం చాలా సర్వ సాధారణంగా మారిపోయింది. ఎందుకంటే విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఇతర వస్తువులను ఇంట్లో ఉంచుకోవటం కంటే లాకర్లలో భద్రపరచుకోవటం సేఫ్ అని చాలా మంది భావిస్తున్నారు. అయితే లాకర్లకు సంబంధించిన నిబంధనలను రిజర్వు బ్యాంక్ మార్పు చేయగా దానికి సంబంధించి కొత్త అగ్రిమెంట్లను బ్యాంకులు తమ ఖాతాదారులతో తిరిగి సంతకాలు తీసుకుంటున్నాయి.

రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఖాతాదారులు తమ బ్యాంక్ లాకర్లకు సంబంధించిన కొత్త అగ్రిమెంట్లపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మంది దానిని పూర్తి చేయలేదని వెల్లడైంది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతాదారులకు సంబంధించిన లాకర్లు సీజ్ అయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును రిజర్వు బ్యాంక్ పలుమార్లు పొడిగించింది. కొత్త అగ్రిమెంట్లలో బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల లాకర్లో భద్రపరచిన వస్తువులకు సంబంధించి చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశాల్లో మార్పులు తీసుకొచ్చారు. 

లాకర్ల విషయంలో నిరంతరం వస్తున్న కంప్లెయింట్ల దృష్ట్యా రిజర్వు బ్యాంక్ లాకర్ పాలసీలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. మార్పు చేసిన నిబంధనలు కస్టమర్లకు రక్షణను పెంచటంతో పాటు పారదర్శకత పెంపు, చట్టపరమైన సమస్యలను పరిష్కారానికి వెసులుబాట్లు కల్పించబడ్డాయి. 

కొత్త రూల్స్ ప్రకారం లాకర్‌లోని వస్తువులను భద్రపరచడం బ్యాంకు బాధ్యత. 2025 డిసెంబర్ నాటికి కొత్త లాకర్ అగ్రిమెంట్లపై ఖాతాదారులు సంతకం చేయకపోతే వారికి లాకర్ల యాక్సెస్ నిలిపివేయవచ్చు, అలాగే కొన్నిసార్లు బ్యాంక్ సదరు వ్యక్తికి సంబంధించిన లాకర్లను సీజ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే కస్టమర్లు వెంటనే తమ లాకర్లు ఉన్న బ్యాంక్ శాఖలను సంప్రదించి దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ సమాచారాన్ని ఈమెయిల్స్, ఫోన్ మెసేజెస్ ద్వారా అందిస్తూ వెంటనే స్పందించి అగ్రిమెంట్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.