
న్యూఢిల్లీ: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ భిక్షమయ్య కు కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు.