షాదీ ముబారక్​ రాకుంటే నేనేం చేయాలె : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

షాదీ ముబారక్​ రాకుంటే నేనేం చేయాలె :  ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

షాదీ ముబారక్​ రాకుంటే.. నేనేం చేయాలె

మహిళపై ప్రభుత్వ విప్ ​సునీత అసహనం

యాదాద్రి, వెలుగు : తనకు షాదీ ముబారక్​ రాలేదని ఓ మహిళ అడగడంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర అసహనానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్(ఎం)లో 48 డబుల్​ బెడ్​రూం ఇండ్లు నిర్మించగా 193 మంది అప్లికేషన్‌‌ పెట్టుకున్నారు. వీరిలో 98 మందిని అర్హులుగా గుర్తించి డ్రా తీసి 48 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల గృహప్రవేశం కోసం నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం గొంగిడి సునీత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మహిళ ‘నాకు డబుల్​బెడ్​రూం ఇల్లు రావడం ఆనందంగా ఉంది. కానీ షాదీ ముబారక్​ రాలేదు’ అని చెప్పారు. దీంతో అసహనానికి గురైన గొంగిడి సునీత అయితే ‘నేనేం చేయాలె’ అన్నారు. అయినప్పటికీ ఆ మహిళ తన చేతిలో ఉన్న శాలువాను ఎమ్మెల్యేకు కప్పబోయారు. అప్పటికే అసహనంతో ఉన్న సునీత శాలువా కప్పుకోకుండా.. ఆమెను తోసుకుంటూ వెళ్లిపోయారు.