నన్ను ఎంతో ప్రేమించే నా భర్త కనిపించడంలేదు సార్ 

నన్ను ఎంతో ప్రేమించే నా భర్త కనిపించడంలేదు సార్ 

బాలీవుడ్ అందాల బామ అలియా భట్ లీడ్ రోల్ లో  నటించిన డార్లింగ్స్ ఆగస్టు 5న ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. లేడీ డైరెక్టర్ జస్మీత్ కె రీన్ తెరకెక్కించిన ఈ సినిమాలో షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మ్యాథ్యూ కీలక పాత్రలో నటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ వదిలారు. ఇందులో వేర్వేరు గెటప్స్ తో అలియా భట్ అదరగొట్టిందని టాక్. ట్రైలర్ ప్రారంభంలో "నా పేరు హమ్జా షేక్. నేను బద్రునిసా (అలియా) భర్తని" అంటూ విజయ్ వర్మ డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత "మిస్సింగ్ కేసు ఫైల్ చేయాలి సార్.. నన్ను ఎంతగానే ప్రేమించే నా భర్త నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు సార్" అంటూ అలియా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్  యాక్షన్ డ్రామాలా ఉంది. ఫైట్ సీన్స్, సస్పెన్స్ కనిపించింది. భార్యాభర్తల జీవితంలోకి మూడో వ్యక్తి (రోషన్) ఎంట్రీ ఇవ్వడంతో వీరి కాపురంలో చిచ్చు పెట్టినట్లు కొన్ని సీన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో అలియా పల్లెటూరి అమ్మాయిలా, ఫ్యాషన్ బ్యూటీగా వెరైటీ పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్ ను థ్రిల్ చేసింది. ఇటీవల రిలీజైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇవాళ వచ్చిన ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు అభిమానులు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 5 వరకు ఆగాల్సిందే.