ఆర్ఆర్ఆర్ షూట్‌‌లో జాయిన్ కానున్న ఆలియా భట్

ఆర్ఆర్ఆర్ షూట్‌‌లో జాయిన్ కానున్న ఆలియా భట్

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌లో ఆలియా జాయిన్ అయింది. దీనికి సంబంధించి తన ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌‌లో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ మూవీలో ఆలియాను ఎంపిక చేసి దాదాపు ఏడాది కావడం గమనార్హం.

కరోనా లాక్‌‌డౌన్, ఆ తర్వాత పరిస్థితుల వల్ల ఆర్ఆర్ఆర్ షూట్‌‌లో ఆలియా ఆలస్యంగా చేరుతోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్‌‌లో చేరిపోయానంటూ ఆలియా ఫొటో షేర్ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో ఆలియా పరిచయం కానుంది. రీసెంట్‌‌‌‌గా మహాబలేశ్వర్‌‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సన్నివేశాలతో కూడిన ఓ షెడ్యూల్ పూర్తయింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్‌‌‌కు చేరుకుంది.