బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌పూర్ గ్రామంలోని బడీడు పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ కే పంపాలని గ్రామపంచాయతీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించాయి.
బడిబాట కార్యక్రమంలో భాగంగా అదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్లకు పంపే ఆలోచనను విరమించుకోవాలని, స్థానిక ప్రైమరీ స్కూల్లోనే చేర్పించాలని తీర్మానం చేశారు. సర్కార్ బడులను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సుధాకర్, కిషన్ రెడ్డి, గంగారెడ్డి, రవి, రాములు, మల్కన్న, హెచ్ఎం పి.అభిమన్యు, టీచర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
