
- ప్లాట్లు తీసుకుని చెయ్యిచ్చిన్రు..
- పోతారంలో గ్రామస్తుల నిరసన ర్యాలీ..రాస్తారోకో
దుబ్బాక, వెలుగు: మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ ఆయన సొంత ఊరైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో ఆదివారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. లిస్టులో పేర్లు లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ప్రాంతం నుంచి ఎస్సీ కాలనీ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదుగా దుబ్బాక, కొత్త పల్లి రోడ్డు వరకు భారీ ర్యాలీ తీశారు. అక్కడే రెండు గంటలు రాస్తారోకో చేశారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, సర్పంచ్గడీల జనార్దన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
100 మంది గ్రామస్తులు మాట్లాడుతూ లిస్టులను మూడు సార్లు మార్చారని, గ్రామంలో కట్టిన 35 ఇండ్లకు శనివారం రాత్రి నంబరింగ్ఇచ్చి లబ్ధిదారుల ఫైనల్లిస్టును గ్రామ పంచాయతీలో పెట్టారన్నారు. గత ప్రభుత్వాలు తమకు 54 ప్లాట్లు ఇవ్వగా అందులో డబుల్‌బెడ్‌రూమ్‌లు కట్టి కనీసం ప్లాట్లు పోయిన బాధితుల పేర్లను కూడా లిస్టులో పెట్టలేదన్నారు. లబ్ధిదారుల జాబితాలో దాదాపు ఎంపీ అనుచరుల పేర్లు, ఇండ్లు, వ్యవసాయ భూములున్న వ్యక్తుల పేర్లు చేర్చారన్నారు. ప్లాట్ పోయిన మాజీ సర్పంచ్తండ్రికి ఇల్లు ఇచ్చి తమకు ఇవ్వకపోవడం ఏమిటన్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు చేస్తామన్నారు. దుబ్బాక, భూంపల్లి పోలీసులు వచ్చి గ్రామస్తులను సముదాయించారు.