ఇవాల్టీ (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ బంద్.. మంత్రులను కలవనున్న నిర్మాతలు, కార్మిక నాయకులు

ఇవాల్టీ (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ బంద్.. మంత్రులను కలవనున్న నిర్మాతలు, కార్మిక నాయకులు

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, మరింత తీవ్రతరం అవుతున్నాయి. సినీ కార్మికుల వేతనాల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగినా, ఎవరి నుంచి ఎటువంటి పరిష్కారం దక్కట్లేదు.  సినీ కార్మికుల చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది.

ఈ క్రమంలోనే, ఇవాల్టీ (ఆగస్టు 11) నుంచి అన్నీ సినిమాల షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. రెండ్రోజుల ముందువరకు ఒకటి అరా షూటింగ్స్ జరిగాయి. కానీ, నేటితో అన్ని సినిమాల షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఈ మేరకు ఇవాళ ఫెడరేషన్ నాయకులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో సమావేశం కానున్నారు. అలానే సినీ కార్మికుల వేతన సవరణ వివాదంపై చర్చిండానికి ఇవాళ మధ్యాహ్నం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు.

►ALSO READ | WAR2 హైలెట్స్: ఎన్టీఆర్ సింగిల్ టేక్ యాక్టర్.. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు: హృతిక్ ప్రశంసల వర్షం

వీరిలో SSMB29 ప్రొడ్యూసర్ KL నారాయణ, మైత్రీ సంస్థ నుంచి రవి శంకర్, పీపుల్ మీడియా నుంచి టీజీ విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, స్వప్న దత్, యూవీ వంశీ, వివేక్ కూచిభొట్ల, డీవీవీ దానయ్య, BVSN ప్రసాద్, బన్నీ వాసు, భరత్ భూషణ్,  తదితరులు ఉన్నారు. మరీ రాజకీయ నాయకులైన ఈ అంశాలన్నీటికీ పరిష్కారం చూపుతారా? లేదా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.