
ఈ ఆగష్టు 15న జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయజెండా ఎగరాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం ఎగరాలని, ఆయా గ్రామ పెద్దలంతా తమ గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.