రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తం : నిర్మలా సీతారామన్

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తం : నిర్మలా సీతారామన్

రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని  తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె ఈ ప్రకటన చేశారు. జూన్ కు సంబంధించి రూ.16,982 కోట్లు పెండింగ్లో  ఉన్నాయని నిర్మల చెప్పారు. ప్రస్తుతం కాంపన్సేషన్ ఫండ్ లో అంత మొత్తం లేకపోయినా కేంద్రం సొంత నిధుల నుంచి ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వసూలు చేసే సెస్ నుంచి ఆ నిధులను సర్దుబాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో జీఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం రాష్ట్రాలకు గత ఐదేళ్లలో బాకీ ఉన్న మొత్తం క్లియర్ అవుతుందని చెప్పారు. 

ఇవాళ్టి సమావేశంలో పెన్సిళ్లు, షార్పనర్లపై ఉన్న 18శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. డ్యూరబుల్ కంటైనర్లకు ఉపయోగించే ట్యాగ్స్ ట్రాకింగ్ డివైజ్లుపై ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన హాజరుకాగా.. తెలంగాణ మంత్రి హరీష్ రావు డుమ్మా కొట్టారు.