
ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోడీకి లేఖ రాసింది. దేశ వ్యాప్తంగా సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని లేఖలో కోరింది. థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనను వెంటనే నిషేధించేలా ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో మోదీని అభ్యర్థించింది.
వారిపై కేసు నమోదు చేయాలి..
ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్, రచయిత మనోజ్ శుక్లాపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోడీని కోరింది. సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు. హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది.
సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది..
"ఆదిపురుష్ " సినిమా హిందువులు, సనాతన ధర్మం సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. దేశంలో రాముడిని ప్రతీ ఒక్కరు దేవుడిలా ఆరాధిస్తారని..అయితే ఆదిపురుష్ సినిమాలో రాముడిని , రావణుడిని వీడియో గేమ్స్లో పాత్రల వలే తీర్చిదిద్దారని మండిపడ్డారు. అలాగే ఈ సినిమాలోని కొన్ని డైలాగులు భారతీయులను బాధించే విధంగా ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజలకు రామాయణం అంటే ఒక విశ్వాసం అని..ఈ సినిమా ఆ విశ్వాసాన్ని దెబ్బతిసేలా తెరకెక్కించారన్నారు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో రాఘవ్ (రామ్)గా ప్రభాస్, జానకి (సీత)గా కృతి సనన్, లంకేష్ (రావణ్)గా సైఫ్ అలీఖాన్ నటించారు.