
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్–బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.
పోస్టుల సంఖ్య: 3501
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బి.ఫార్మా, బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతి, పదో తరగతి, బీపీటీ, ఎంఎస్సీ, ఎంసీఏ, డి.ఫార్మా, డీఎంఎల్టీ, బీఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జులై 31.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. పీబీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున 400 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు లేదా 1 మార్కు కోత విధిస్తారు.
ఎగ్జామ్ సిలబస్: కంప్యూటర్ బేస్డ్ టెస్టులో జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు 100 మార్కులకు, కోర్ సబ్జెక్ట్ నుంచి 75 ప్రశ్నలు 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.