గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలి: గిరిజన ఉద్యోగుల సంఘం

గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలి: గిరిజన ఉద్యోగుల సంఘం

ముషీరాబాద్, వెలుగు: గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ డిమాండ్​చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బొజ్జ గాని నాగార్జున, శ్రీమన్నారాయణతో కలిసి పీవీ రమణ సిటీలోని ఇంట్లో మంత్రి సీతక్కను కలిశారు. 

గిరిజనుల సమస్యలు వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం పీవీ రమణ మాట్లాడుతూ ఆర్టికల్ 338 ఏ ప్రకారం ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్లు విడివిడిగా ఉన్నాయని, తెలంగాణలోనూ సపరేట్ చేయాలని కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని, త్వరలో సీఎం రేవంత్​రెడ్డిని కల్పిస్తానని చెప్పారని రమణ తెలిపారు.