ట్రంప్‌కు న్యాయపరంగా దారులన్నీ క్లోజ్

ట్రంప్‌కు న్యాయపరంగా దారులన్నీ క్లోజ్

4 రాష్ట్రాల్లో ఎన్నికలను రద్దు చేయాలన్న లా సూట్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రంప్ న్యాయపోరాటానికి ఫుల్ స్టాప్!

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కోర్టుల్లో లా సూట్లు వేస్తూ వస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్​కు ఇక దారులన్నీ మూసుకుపోయినయ్.ఇప్పటికే పెన్సి ల్వేనియా, తదితర రాష్ట్రాల్లోని కోర్టులు ట్రంప్ లా సూట్లను కొట్టేయగా.. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురైంది. జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలను రద్దు చేయాలంటూ ట్రంప్​తో పాటు టెక్సాస్ తదితర రాష్ట్రాల అటార్నీలు వేసిన లా సూట్​ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ‘‘ఈ కేసును విచారించాలని కోర్టు భావించింది. కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై టెక్సస్ ఇలా జోక్యం చేసుకోవడం న్యాయపరంగా సరైనదిగా కన్పించడం లేదు. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాం” అని  సుప్రీంకోర్టు జస్టిస్​లు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల రిజల్ట్స్ ను సవాల్ చేసేందుకు ట్రంప్ కు ఇక న్యాయపరంగా ఉన్న  దారులన్నీ మూసుకుపోయాయి.

సుప్రీంకోర్టు తీర్పు అవమానకరం: ట్రంప్

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ‘‘సుప్రీంకోర్టు మమ్మల్ని నిజంగా కూలదోసింది. వివేకం లేదు. ధైర్యం లేదు.. కోర్టు తీర్పు అవమానకరం. ఇది మొత్తం అమెరికాకే ఆందోళనకరమైన విషయం” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికా ప్రెసిడెంట్​గా జో బైడెన్ ను ఈ నెల 14న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది.

For More News..

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌‌లో మరోసారి విభేదాలు

అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!

విదేశాలను మించిన జాబ్ ఆఫర్స్ ఇక్కడే