- ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు కొత్తగా వీసీలను నియమిస్తే.. వారిలో ఒక్క మాల ప్రొఫెసర్కూడా లేడని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం అసోసియేషన్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. జేఎన్టీయూ, డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్ఎఫ్ యూ, వెటర్నరీ యూనివర్సిటీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీల్లోనైనా మాలలకు అవకాశం ఇవ్వాలని, కనీసం ముగ్గురు మాల ప్రొఫెసర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అంసా రాష్ట్ర కార్యదర్శి నీరడి సూర్యం, ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, నాయకులు దుగ్గీ సురేశ్, గాజుల నవీన్ పాల్గొన్నారు