అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి : షేక్​ రిజ్వాన్​ బాషా

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి : షేక్​ రిజ్వాన్​ బాషా

జనగామ అర్బన్, వెలుగు :  అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్​ షేక్​ రిజ్వాన్​ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని కాన్పరెన్స్​ హాల్లో జిల్లా అధికారులతో అడిషనల్​ కలెక్టర్లు పర్మర్​ పింకేశ్​ కుమార్​, రోహిత్​ సింగ్​ లతో కలిసి రివ్యూ నిర్వహించారు.  సీఎం ప్రజాదర్బార్​ వెబ్​సైట్​లో జనగామ జిల్లా నుంచి 450 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఈ మేరకు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు సంబంధిత శాఖల అధికారులు వేంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి పరిష్కారంలో జనగామ జిల్లా 5వ స్థానానికి చేరుకునేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్​లో పారశుధ్ద్యం, మొక్కల పెంపకంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పరిశుభ్రతకు పచ్చదనానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మండల పరిధిలో ఏ సమస్య తలెత్తిన జిల్లా అధికారులు ఫీల్డ్​ విజిట్​ చేసి సమస్యలను త్వరితగతిన పూర్తి  చేయాలని అన్నారు. పార్లమెంట్​ ఎన్నికలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన జిల్లా స్కిల్​ కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు స్కిల్​ డెవలప్​మెంట్​ లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్​మెంట్​ ఆఫీసర్ ఉమారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.