అగ్నిపథ్​ను వెనక్కి తీసుకోవాల్సిందే

అగ్నిపథ్​ను వెనక్కి తీసుకోవాల్సిందే

 ఖైరతాబాద్, వెలుగు: అగ్నిపథ్ స్కీమ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిపథ్​ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఓయూ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన రాష్ట్ర మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..  సికింద్రాబాద్ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఓయూ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకులు 8 అంశాలపై తీర్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారామ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, నేషనల్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్,  సీనియర్ నాయకులు రవి నాయక్, నరేశ్​ జాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్, ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, ఎస్ఎఫ్ఎస్ జే అధ్యక్షుడు అశోక్ యాదవ్, టీవీఎస్ అధ్యక్షుడు పుదరి హరీశ్ గౌడ్, బీసీ నేత చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.