
పంచాయతీ రాజ్ చట్టం– 2018 సవరణ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు అఖిలపక్ష నేతలు. వీరిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య , కెపి వివేకానంద గౌడ(BRS) , సీపీఐ నేతలు నారాయణ , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు.
తెలంగాణలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆగస్టు 31న శాసన సభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌజ్ పరిగణనలోకి తీసుకొని బీసీ లకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరారు పీసీసీ చీఫ్, మంత్రులు ,అఖిలపక్ష నేతలు.