
- బార్డర్ ఇష్యూపై చర్చించేందుకు
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రధాని మోడీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రం 5గంటలకు అన్ని పార్టీల చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతారని పీఎం ఆఫీస్ బుధవారం వెల్లడించింది. “ ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్ని పరిస్థితులపై చర్చించేందుకు మోడీ అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. వివిధ పార్టీల ప్రెసిడెంట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీలో పాల్గొంటారు” అని పీఎంవో ఇండియా బుధవారం ట్వీట్ చేసింది. లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో సోమవారం అర్ధరాత్రి చైనా ఆర్మీతో జరిగిన గొడవలో 20 మంది మన జవాన్లు అమరులై వీర మరణం పొందారు. కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.