డిసెంబర్ 2న పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం

డిసెంబర్ 2న పార్లమెంట్  అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్‌‌సభ, రాజ్యసభలోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌‌ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా సీనియర్ నేతలు హాజరుకానున్నారు. 

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమై.. 22 వరకు మొత్తం 15 సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో వలసరాజ్యాల కాలం నాటి క్రిమినల్ చట్టాలను మార్చే మూడు బిల్లులతో సహా కీలకమైన ముసాయిదా చట్టాలను ఆమోదించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 37 బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌‌లో ఉన్నాయి.