ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌

ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌.. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో బోణీ చేసింది. హజ్రతుల్లా జజారీ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 37 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రహమానుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40) రాణించడంతో.. శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అఫ్తాన్‌‌‌‌‌‌‌‌ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 105 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. భానుకా రాజపక్స (38), చామికా కరుణరత్నె (31) మినహా అందరూ విఫలమయ్యారు. తర్వాత అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ 10.1 ఓవర్లలో 106/2 స్కోరు చేసి గెలిచింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ కావడంతో, లంక బౌలర్ల నుంచి పెద్ద ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. స్టార్టింగ్​ నుంచే రెహమానుల్లా నాలుగు భారీ సిక్సర్లు సంధించాడు. హజ్రతుల్లా బౌండ్రీలతో అండగా నిలవడంతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 6.1 ఓవర్లలోనే 83 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించింది. ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో రెహమానుల్లా, 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఇబ్రహీం (15) ఔటైనా, నజీబుల్లా (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి హజ్రతుల్లా లక్ష్యాన్ని ఛేదించాడు. 

పెవిలియన్‌‌‌‌కు క్యూ..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన లంకేయులు.. ఫ్లాట్‌‌ పిచ్‌‌పై బొక్కా బోర్లా పడ్డారు. అఫ్గాన్‌‌ లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ ఫారూఖీ (3/11) బౌలింగ్‌‌ను ఎదుర్కోలేక పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. స్పిన్‌‌ ద్వయం ముజీబుర్‌‌ రెహమాన్‌‌ (2/24), మహ్మద్‌‌ నబీ (2/14) మిడిల్‌‌ ఓవర్స్‌‌లో లంక బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. ఇక స్టార్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ (0/12) వికెట్‌‌ తీయకుండా ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌‌ చేయడం అఫ్గాన్‌‌కు ఇదే తొలిసారి. ఓపెనర్లలో నిసాంకా (3), కుశాల్‌‌ మెండిస్‌‌ (2)తో పాటు వన్‌‌డౌన్‌‌లో చరితా అసలంక (0) సింగిల్‌‌ డిజిట్‌‌కే ఔట్‌‌కావడంతో.. లంక స్కోరు 5/3గా మారింది. ఈ దశలో గుణతిలక (17), రాజపక్స ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హసరంగ డిసిల్వ (2), డాసున్‌‌ షనక (0) నిరాశపర్చడంతో లంక పతనం ఆగలేదు. ఈ టైమ్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన చామికా కరుణరత్నె నిలకడగా ఆడాడు. రాజపక్సతో కలిసి అఫ్గాన్‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 10 ఓవర్లలో 64 రన్స్‌‌ చేసిన లంకకు 13వ ఓవర్లలో ఘోరమైన దెబ్బ పడింది. వరుసగా రెండు బాల్స్‌‌లో రాజపక్స, మహీశ్‌‌ తీక్షణ (0) రనౌట్‌‌ కావడంతో లంక 69/8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కరుణరత్నె చివరి ఓవర్‌‌ వరకు క్రీజులో ఉండటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. పతిరన (5), మధు షనక (1 నాటౌట్‌‌) విఫలమయ్యారు.