భారత్, శ్రీలంక మధ్య నిన్న జరిగిన రెండో టీ20లో టీం ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. భారీ ఓటమి తప్పదు అనుకున్న టైం లో ఏడో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన అక్షర్, జడేజా రికార్డ్ ని బద్దలు కొట్టాడు. టీ20ల్లో భారత్ తరుపున ఏడో నెంబర్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక స్కోరు (65) చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ జడేజా(44) పేరిట ఉంది. అంతేకాకుండా భారత్ తరపున టీ20ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ గా అక్షర్ నిలిచాడు.
అయితే, నిన్న రాత్రి జరిగిన రెండో టీ20 లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ఫెయిల్ అయి మ్యాచ్ ను చేజార్చుకుంది. చిత్తుగా ఓడుతుంది అనుకున్న మ్యాచ్ లో అక్షర్ (31 బాల్స్ 65), సూర్య కుమార్ (36 బాల్స్ 51) రాణించారు. అటు బాల్ తోనూ అక్షర్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అక్షర్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
