నేటి నుంచి ఆన్​లైన్​లో సదరం స్లాట్ బుకింగ్స్

నేటి నుంచి ఆన్​లైన్​లో సదరం స్లాట్ బుకింగ్స్


హైదరాబాద్, వెలుగు: నేటి నుంచి ఆన్ లైన్​లో సదరం స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ అప్​డేషన్​లో భాగంగా ఇన్నిరోజులు ఆన్ లైన్ స్లాట్ల బుకింగ్​ను నిలిపివేశామన్నారు. ప్రస్తుతం మళ్లీ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని.. సిటీలో అర్హులైన దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.