ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాతే ఆల్‌‌స్టా‌ర్‌ మ్యాచ్‌

ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాతే ఆల్‌‌స్టా‌ర్‌ మ్యాచ్‌

ముంబై: ఐపీఎల్‌‌ 13వ ఎడిషన్‌‌కు సన్నాహకంగా వచ్చే నెల 25న నిర్వహించాలనుకున్న ఆల్‌‌స్టా‌ర్‌ మ్యాచ్‌ లీగ్‌ చివరికి మారింది. మే 24న జరిగే ఐపీఎల్‌‌ ఫైనల్‌‌ తర్వాత ఈ మ్యాచ్‌ ఉండనుంది. మ్యాచ్‌ జరిగే తేదీ, వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్​ లార్జెస్ట్​ స్టేడియం మొతెరాలో ఈ మ్యాచ్​ జరిగే చాన్సుంది. లీగ్‌‌లో పెర్ఫామెన్స్‌ ఆధారంగా ఆల్‌‌స్టార్‌ మ్యాచ్‌ ఆడే రెండు జట్లకు ప్లేయర్స్‌‌ను ఎంపిక చేస్తామని ఐపీఎల్‌‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌‌ చెప్పారు. మార్చి 29న ముంబై ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్‌ జరగనుంది. అంతకముందు మార్చి 18న ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌‌ ముగుస్తుంది. ఆ తర్వాత ఆసియా ఎలెవన్‌ , వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం పలువురు ఇండియన్‌ క్రికెటర్లు బంగ్లాదేశ్‌ వెళ్తారు. ప్లేయర్స్‌ అందుబాటుతో పాటు బ్రాడ్‌ కాస్టర్లతో ఒప్పందాల దృష్ట్యా ఆల్‌‌స్టార్‌ మ్యాచ్‌‌ను లీగ్‌ ముగిశాక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.