జూరాల, సాగర్‌‌‌‌‌‌‌‌ గేట్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌

జూరాల, సాగర్‌‌‌‌‌‌‌‌ గేట్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌

గద్వాల, వెలుగు: కర్నాటక ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల నుంచి వచ్చే నీటితో పాటు బీమా నది వరద పూర్తిగా తగ్గడంతో సోమవారం ఉదయం జూరాల గేట్లను క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో తగ్గడంతో రెండు కేంద్రాల ద్వారా విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 20 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో మాత్రమే వస్తోంది. జూరాల నుంచి 2,985 క్యూసెక్కుల నీటిని కాల్వలు, లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా విడుదల చేస్తున్నారు.

సాగర్‌‌‌‌‌‌‌‌కు తగ్గిన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో
హాలియా/మేళ్లచెరువు, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో తగ్గడంతో ఆఫీసర్లు క్రస్ట్‌‌‌‌‌‌‌‌ గేట్లను క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సోమవారం ఉదయం వరకు వరద ప్రవాహం కొనసాగడంతో 18 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో భారీగా తగ్గిపోయింది. దీంతో అన్ని గేట్లను క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేసి నీటి విడుదల ఆపేశారు. ఎగువ నుంచి సాగర్‌‌‌‌‌‌‌‌కు 46,401 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తుండగా, కుడి కాల్వకు 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,541, పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌కు 29,760, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీకి 1,800, ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌సీకి 600 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

సాగర్‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 588.60 అడుగులు, 307.8746 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌‌‌‌‌‌‌‌ గేట్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో నిలిచిపోయింది. పులిచింతలలో ప్రస్తుతం 37.4 టీఎంసీల నీరు ఉండగా, 12 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాలుగు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల పవర్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తున్నారు.