ఈ క్రేజ్ ఏందీ సామి.. ఆదిపురుష్ దెబ్బకు సైట్స్ అన్నీ క్రాష్

ఈ క్రేజ్ ఏందీ సామి.. ఆదిపురుష్ దెబ్బకు సైట్స్ అన్నీ క్రాష్

తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్(Adipurush) టికెట్  బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో(Book my show) లో మూవీ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున టికెట్స్ బుకింగ్ కోసం ఎగబడటంతో సైట్ క్రాష్ అయ్యింది. 

జూన్ 13 అర్ధరాత్రి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అభిమానులు టికెట్స్ కోసం ఎగబడటంతో..  తెల్లవారు జామున 4 గంటల వరకు సైట్ క్రాష్ అయ్యింది. 4 గంటల నుంచి తిరిగి బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే అల్ షోస్ కు సంబంధించిన టికెట్స్ అన్ని దాదాపుగా అమ్ముడయ్యాయి. రిలీజ్ రోజే కాదు.. ఫస్ట్ వీకెండ్ కు సంబదించిన టికెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే జోరు కనిపిస్తోంది. దీంతో.. ఈ సినిమా మొదటిరోజు భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. ఇక టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం ఉండటంతో.. మొదటిరోజు ఈ సినిమా అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. మరి ప్రీ బుకింగ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.