ట్రంప్‌‌కు కరోనాతో స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలం

ట్రంప్‌‌కు కరోనాతో స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌ , ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌‌‌‌‌‌‌‌కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆయిల్ ధరలు అతలాకుతలమయ్యాయి. ఇదే ఛాన్స్ అనుకుని గోల్డ్ ధరలు రయ్‌‌‌‌‌‌‌‌మని పరుగులు పెట్టాయి. ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ 500, డౌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌  ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ 2 శాతానికి పైగా పడిపోయాయి. ఆయిల్ ధరలు 3 శాతానికి పైగా దిగజారాయి. అటు వాల్‌‌‌‌‌‌‌‌స్ట్రీట్ మార్కెట్లు పడిపోవడంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాలు పాలయ్యాయి. ప్రారంభంలో లాభాలు పొందిన ఆసియన్ మార్కెట్లు ట్రంప్ ట్వీట్‌‌‌‌‌‌‌‌కు కిందకు పడ్డాయి.   బ్రెంట్ క్రూడ్ 2.7 శాతం తగ్గి బ్యారల్ 39.81 డాలర్లకు పడిపోయింది. అమెరికా ఆయిల్ కూడా 2.9 శాతం పడిపోయి బ్యారల్‌‌‌‌‌‌‌‌ 37.60 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఆయిల్ మార్కెట్ నెగిటివ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఈ న్యూస్‌‌‌‌‌‌‌‌తో ఆయిల్ షేర్లలో మరింత అనిశ్చితి నెలకొందని ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెప్పారు. గోల్డ్ ధరలు మాత్రం గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పరుగులు పెడుతున్నాయి. ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌‌‌‌‌‌‌‌కు 1,913.90 డాలర్ల వద్ద రికార్డైంది. సిల్వర్ రేట్లు కూడా 0.9 శాతం పెరిగి ఒక ఔన్స్‌‌‌‌‌‌‌‌ 23.9992 డాలర్లుగా ఉంది. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై పడే అవకాశం కూడా ఉంది. శుక్రవారం గాంధీ జయంతి కావడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ సోమవారం మార్కెట్లపై ఉండొచ్చని విశ్లేషకులంటున్నారు. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్‌ పదవికి పోటీపడుతున్న ట్రంప్ తన ప్రత్యర్థి బైడెన్‌తో పోలిస్తే కాస్త వెనుకంజలో ఉన్నారని  ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కరోనా వైరస్​ బారినపడ్డారు.

For More News..

అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ అబద్ధాలను రైతులు నమ్మరు

కరోనా వస్తే దీదీని హగ్​ చేసుకుంటానన్నబీజేపీ నేతకు పాజిటివ్

మంత్రాలు చేస్తోందనే డౌట్​తో తల వేరు చేసిన్రు.. అడ్డొచ్చిందని టీచర్‌నూ చంపిన్రు