శుక్రవారం విడుదలకు సిద్ధంగా మూడు సినిమాలు  

శుక్రవారం విడుదలకు సిద్ధంగా మూడు సినిమాలు  

శుక్రవారం (ఈనెల 6వ తేదీ) మూడు సినిమాలు విడుదలకానున్నాయి. హీరో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీతో రాబోతుంటే, డబ్బు కంటే ఆశ చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అంటూ శ్రీ విష్ణు భళా తందనాన అంటున్నాడు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్‌గా నటించింది. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ యాంకర్ సుమ లీడ్ రోల్ లో నటించిన జయమ్మ పంచాయితీతో రాబోతుంది.

ఇప్పటికే ఈ మూడు సినిమాలు పబ్లిసిటీ కూడా తమకు తోచిన విధంగా చేసుకున్నాయి. ఈ సినిమాల్లో విశ్వక్ అశోక వనంలో అర్జున కళ్యాణం కాస్తా ఆకర్శిస్తోంది. శ్రీ శ్రీష్ణు కూడా ఇప్పటికే డిఫరెంట్ సబ్జెక్ట్ లతో మంచి విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే భళా తందనానతో మరోసారి విజయం అందుకోవాలని ఆశపడుతున్నాడు. మరి మూడు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు..? ఏ మూవీ హిట్‌ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే..!