
ఓయూ, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సోమవారం నుంచి జరగాల్సిన ఇతర ఎగ్జామ్స్ అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు.