వైజాగ్ లో స్టెరీన్ గ్యాస్ అల్లకల్లోలం

వైజాగ్ లో స్టెరీన్ గ్యాస్ అల్లకల్లోలం

ఏపీలోని విశాఖపట్నం శివారు ఊళ్లు విషవాయువుకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జనం పిట్టల్లానేలపై పడి అల్లాడిపోయారు. గురువారం తెల్లవారుజాము నుంచి కొన్ని గంటల పాటు స్టైరీన్ గ్యాస్ వైజాగ్  అల్లకల్లోలం చేసింది. ఎటుచూసినా హాహాకారాలు.. ఆర్తనాదాలే.. ఒకప్పటి భోపాల్ గ్యాస్  విషాద దృశ్యాలే కనిపిం చాయి. ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరి నుంచి లీకైన స్టైరీన్ గ్యాస్ 11 మందిని పొట్టనపెట్టుకుంది. వందలాది మందిని తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. మూగ జీవాల పరిస్థితి మరీ దయనీయం. కొట్టాల్లో కట్టేసిన బర్లు, ఎద్దులు.. రోడ్ల మీది కుక్కలు.. ఇండ్లల్లోని కోళ్లు, పిల్లులు, బల్లులు గిల గిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి. పచ్చని చెట్లు నల్లబారిపోయాయి.

ఏందీ గ్యాస్

కరిగి ఆవిరైపోయే గుణం దీనిది. అంతేకాదు, మనం తినే తిండిలోనూ ఇది కొద్ది పాళ్లల్లో ఉంటుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, మాంసం, డ్రింకుల్లో అది అతికొద్ది మోతాదులో ఉంటుంది. సిగరెట్స్ , వాహనాల పొగలోనూ ఉంటుంది. మనకుడేంజరేనా..? నిజానికి ఇది అంత డేంజర్ కాదని సైంటిస్టులు చెబుతారు. ఇప్పటిదాకా చేసిన స్ట డీల్లో సేఫేనని తేల్చారు. అయితే, డైరెక్ట్ గా ఆ గ్యాస్ ను  పీల్చు కుంటే మాత్రం ముప్పు లేక పోలేదు. షార్టర్మ్  , లాంగ్ టర్మ్ లో ఎఫ్ క్ట్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ టైంలో కలిగే ముప్పు కళ్లు, చర్మం, ముక్కులో మంటలు,కడుపులో వికారం, ఊపిరి తీసుకోలేకపోవడం, లాంగ్టర్మ్ ఎఫెక్స్ ట్, ఎక్కువ కాలం స్టెరీన్ కు ఎక్స్ పోజ్ అయితే  దాని వల్ల ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కిడ్నీల పై ప్రభావం పడుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఉంటుంది. దాని వల్ల జ్ఞాపకశక్తి మంద గిస్తుంది. ఏదైనా విషయానికి వెంటనే స్పందించలేం. తెలివితేటలపై ఎఫెక్ట్ పడుతుంది.  తీవ్రమైన తలనొప్పి, అలసట, సత్తువ లేకపోవడం, డిప్రెషన్ వంటివి బాధిస్తాయి. వినికిడి సమస్య వస్తుంది. లివర్ పైనా ప్రభావం ఉంటుంది. స్టెరిన్ ఫ్యాక్టరీలలో పనిచేసే ఆడవాళపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అబార్షన్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ పైనా ఎఫెక్ట్ చూపిస్తుంది. కేన్సర్ ముప్పు కూడా ఉంటుంది. బ్లడ్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. స్టెరైన్ లో  గ్రూప్2బీ ఎక్కువగా కేన్సర్ కు కారణమవుతుందని సైంటిస్టులు అంటున్నారు.