
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తల్లి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. శ్రీమతి నిర్మల్ కపూర్ శుక్రవారం(మే2) సాయంత్రం 5.25 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో కపూర్ కుటుంబం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది.
బాలీవుడ్ ప్రముఖులు,కపూర్ కుటుంబ సభ్యులు జాన్వీ కపూర్,ఖుషీ కపూర్ లు నిర్మల్ కపూర్ నివాసంలో చివరి నివాళులు అర్పించారు. పుకార్, నో ఎంట్రీ, లోఫర్, రూప్ కీ రాణి చోరోం కా రాజా వంటి ప్రముఖ చిత్రాలకు నిర్మాత,సహాయ దర్శకుడు సురీందర్ కపూర్‌ను భార్య నిర్మల్ కపూర్.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన తల్లి మరణంతో చాలా దు:ఖసాగరంలో మునిగిపోయారు. అనిల్ కపూర్ తన తల్లి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అనిల్ కపూర్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె 88వ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. అనిల్ కపూర్ తల్లి మరణం పట్ల అతని అభిమానులు,సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
►ALSO READ | రాజ్ తరుణ్-లావణ్య: కోకాపేట ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి కొనుకున్నోళ్లు వస్తున్నరంట..!