మైక్రోసాఫ్ట్ కాలింగ్ యాప్ Skype షట్ డౌన్..యూజర్లు ఇలా చేస్తే మీ కాంటాక్ట్స్ సేఫ్

మైక్రోసాఫ్ట్ కాలింగ్ యాప్ Skype షట్ డౌన్..యూజర్లు ఇలా చేస్తే మీ కాంటాక్ట్స్ సేఫ్

స్కైప్ (Skype )ఇంటర్నెట్ కాలింగ్ యాప్ గురించి మనందరికి తెలిసిందే.ఇది మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ యాప్ కు మిలియన్ల కొద్దీ యూజర్లున్నారు. ఒకప్పుడు టాప్ ఇంటర్నెట్ కాలింగ్ యాప్ గా ఉన్న స్కైప్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం స్కైప్ చాలా యేళ్లపాటు సేవలందించింది.అటువంటి స్కైప్ ను మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా రీప్లేస్ చేస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు.. స్కైప్ ను నిలిపివేస్తున్నట్లు 2025 ప్రారంభంలోనే ప్రకటించింది. యూజర్లు సిద్దం అయ్యేందుకు నెలల సమయం ఇచ్చింది. మే 5 న ఈ ప్లాట్ ఫాం ఆఫ్ లైన్ లోకి వెళ్తుంది. అంటే ఇకపై స్కైప్ ద్వారా వీడియోకాల్స్, మేసేజ్ వంటి చేసుకోవడం సాధ్యం కాదు. 

స్కైప్ ను మూసివేస్తే తమ కాంటాక్ట్స్ పరిస్థితి ఏంటని యూజర్లు ఆందోళన చెందుతున్న క్రమంలో మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందొద్దని తెలిపింది.  స్కైప్ నుంచి టీమ్స్ కు ఈజీగా మారవచ్చు. ప్రస్తుత ఐడీ టీమ్స్ తో పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. చాట్ లు, కాంటాక్ట్ లిస్టులను సులభంగా మైగ్రేట్ చేసుకోవచ్చు. టీమ్స్ ఇలాంటి ఫీచర్లను అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. 

స్కైప్ లో అంతర్జాతీయ కాలింగ్, స్కైప్ నంబర్లు, వాయిస్ మెయిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిని రెన్యువల్ చేయడం ఇప్పటికే నిలిపివేసింది. ఇవి కొన్ని టీమ్స్ లో కలిపారు. ప్రస్తుతం రన్ అవుతున్న ప్లాన్ 2025 చివరి వరకు కొనసాగుతాయి. 

స్కైప్ కు ప్రత్యామ్నాయం ఏమిటీ?

స్కైప్ స్థానంలో టీమ్స్ ఉపయోగించాలని మైక్రోసాఫ్ట్ కోరుకుంటుంది..అయితే యూజర్ల ఇష్టానికి వదిలివేసింది. జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ వంటి ప్రముఖ ప్లాట్ ఫాం లను వినియోగించి వీడియో, వాయిస్ కాలింగ్ లను అవసరలాకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.  

►ALSO READ | Tech layoffs: బాబోయ్.. 4 నెలల్లో ఇన్ని వేల మందిని సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి పీకేశారా..?

యూఎస్ మార్కెట్లో వాట్సాప్ అందుబాటులో ఉండదు.. కాబట్టి IMO, జూమ్, బొటిమ్ వంటి సపోర్టు చేసే యాప్ లను వినియోగించవచ్చు. చైనాలో అయితే వీడియో కాలింగ్ కోసం చైనా యాప్ లు ఉన్నాయి.. వీటిని ఇండియన్లు సులభంగా పొందవచ్చని మైక్రోసాఫ్ట్ సూచించింది.