తెలంగాణ కులగణనను కేంద్రం ఫాలో కావాలి:CWC తీర్మానం

తెలంగాణ కులగణనను కేంద్రం ఫాలో కావాలి:CWC తీర్మానం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను కేంద్ర ప్రభుత్వం ఫాలో కావలాని కాంగ్రస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. తెలంగాణ అనుకరించిన పద్దతిలో కులగణన చేయాలని కోరింది. 

 విస్తృతంగా సంప్రదింపుల తర్వాత అంత్యంత సమర్థవంతంగా కులగణన చేశారు..పౌరసమాజం, సామాజిక వేత్తలను భాగస్వామ్యం  చేశారు. కేంద్రం కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని తీర్మానించారు.

 శుక్రవారం (మే2) న ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణసీఎం రేవంత్ రెడ్డి కులగణనపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ కులగణనను కాంగ్రెస్ వర్కింగ్  కమిటీ అభినందించారు. 

సీడబ్ల్యూసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో CWC సమావేశం నిర్వహించారు. కులగణనపై కేంద్రం నిర్ణయం, పహల్గాం దాడిపై సీడబ్ల్యూసీలో చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, CWC  సభ్యులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్ సింగ్ సుఖ్ హాజరయ్యారు. 

►ALSO READ | ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో..ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం

జనాభా దామాషా పద్దతిలో రిజర్వేషన్లు వర్గీకరించాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. వీలైనంత త్వరగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కులగణన లెక్కల ప్రకారం ఆయా వర్గాలకు బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలని కాంగ్రెస్ కోరుతోంది. 

కులగణనపై కాంగ్రెస్ ఇప్పటికే ప్రాధాన్యతను చాటుకుంది.కాంగ్రెస్ వత్తిడివల్లే మోదీ ప్రభుత్వం దిగొచ్చి కులగణనకు సిద్దమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు.అయితే బీజేపీ మాత్రం కులగణనను చేపడుతున్నది కేవలం ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని చెబుతున్న నేపథ్యంలో కాస్ట్ సెన్సెస్ పై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.