ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో..ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం

ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో..ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం

ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో CWC సమావేశమయ్యింది.కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, CWC  సభ్యులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్ సింగ్ సుఖ్ హాజరయ్యారు. 

కులగణనపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన క్రమంలో అనుసరించాల్సిన కార్యచరణపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు.  ఈ సమావేశంలోనే రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

జనాభా దామాషా పద్దతిలో రిజర్వేషన్లు వర్గీకరించాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. వీలైనంత త్వరగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కులగణన లెక్కల ప్రకారం ఆయా వర్గాలకు బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలని కాంగ్రెస్ కోరుతోంది. 

కులగణనపై కాంగ్రెస్ ఇప్పటికే ప్రాధాన్యతను చాటుకుంది.కాంగ్రెస్ వత్తిడివల్లే మోదీ ప్రభుత్వం దిగొచ్చి కులగణనకు సిద్దమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు.అయితే బీజేపీ మాత్రం కులగణనను చేపడుతున్నది కేవలం ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని చెబుతున్న నేపథ్యంలో కాస్ట్ సెన్సెస్ పై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.