GT vs SRH: సన్ రైజర్స్‌కు బిగ్ షాక్: వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్న రషీద్ ఖాన్

GT vs SRH: సన్ రైజర్స్‌కు బిగ్ షాక్: వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్న రషీద్ ఖాన్

ఐపీఎల్ 2025 లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదయింది. శుక్రవారం (మే 2) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ ప్లేయర్ రషీద్ ఖాన్ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకోవడం హైలెట్ గా మారింది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రసిద్ కృష్ణ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని ట్రావిస్ హెడ్ పుల్ షాట్ ఆడాడు. టైమింగ్ మిస్ కావడంతో డీప్ వికెట్ వైపుగా బాల్ గాల్లోకి లేచింది. 

డీప్ వికెట్ కు చాలా దూరంలో ఉన్న రషీద్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దాదాపు 20 మీటర్ల దూరం వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకొని సన్ రైజర్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. అప్పటివరకు నాలుగు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన హెడ్.. 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో 49 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రషీద్ ఖాన్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. 

►ALSO READ | GT vs SRH: నాటౌట్ అయినా ఔటిచ్చారు: వివాదాస్పద రనౌట్.. డగౌట్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన గిల్

225 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్ లో అభిషేక్ శర్మ (28), ఇషాన్ కిషన్ (4) ఉన్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.