GT vs SRH: మరోసారి సహనం కోల్పోయిన గిల్.. ఈ సారి గ్రౌండ్‌లో అంపైర్‌తో వాగ్వాదం..అభిషేక్ శర్మ కూల్ చేశాడు

GT vs SRH: మరోసారి సహనం కోల్పోయిన గిల్.. ఈ సారి గ్రౌండ్‌లో అంపైర్‌తో వాగ్వాదం..అభిషేక్ శర్మ కూల్ చేశాడు

శుక్రవారం (మే 2) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ వరుసగా రెండోసారి తన సహనాన్ని కోల్పోయాడు.  తొలి ఇన్నింగ్స్ లో వివాదాస్పద రనౌట్ తర్వాత డగౌట్ లో ఫోర్త్ అంపైర్ పై గొడవకు దిగిన గిల్.. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ పై సహనం కోల్పోయాడు. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ 14 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రసిధ్ కృష్ణ వేసిన బంతిని అభిషేక్ శర్మ ఆడడంలో విఫలమయ్యాడు. బాల్ ప్యాడ్లకు తగలడంతో ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో గుజరాత్ కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బాల్ ట్రాకింగ్ వికెట్లను హిట్ అవుతూ చూపించింది. కానీ ఇంపాక్ట్స్ మాత్రం అంపిర్స్ కాల్ ఉంది. దీంతో అభిషేక్ శర్మను ఆన్ ఫీల్డ్ అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఏదో విషయంపై గిల్ అంపైర్ తో గొడవ పడుతూ కనిపించాడు. కారణమేంటో ఖచ్చితంగా తెలియకపోయినా ఆన్ ఫీల్డ్ అంపైర్ పై గిల్ తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. అభిషేక్ శర్మ గిల్ ను కూల్ చేయడంతో ఈ గొడవకు తేరా పడింది. 

►ALSO READ | GT vs SRH: సన్ రైజర్స్‌కు బిగ్ షాక్: వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్న రషీద్ ఖాన్

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ ( 38 బంతుల్లో 76: 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ మూడు వికెట్లు తీసుకోగా.. అన్సారీ, కమ్మిన్స్ తలో వికెట్ తీసుకున్నారు.