హిందువా.. ముస్లిమా అని చూడం:అలహాబాద్ హైకోర్టు

హిందువా.. ముస్లిమా అని చూడం:అలహాబాద్ హైకోర్టు

పెళ్లి చేసుకున్నవారు మేజర్లయితే చాలు

అలహాబాద్: వివాహాల్లో హిందూ, ముస్లిం అనే తేడాలను కోర్టు చూడదని.. పెండ్లి చేసుకున్న వారు మేజర్లా కాదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు స్పష్టం చేసింది. మేజర్లకు తమ జీవితభాగస్వాములను సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకునే హక్కు ఉంటుందని చెప్పింది. హిందూ అమ్మాయిని పెండ్లి చేసుకున్న ముస్లిం అబ్బాయిపై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కోర్టు మంగళవారం విచారించింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఖుషినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సలామత్‌‌‌‌‌‌‌‌ అన్సారీ.. అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెండ్లికి ముందు ప్రియాంక మతం మారి తన పేరును ఆలియాగా మార్చుకుంది. తన కూతురును కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసి బలవంతంగా పెండ్లి చేసుకున్నాడని సలామత్‌‌‌‌‌‌‌‌, మరో ముగ్గురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై సలామత్‌‌‌‌‌‌‌‌ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును కొట్టేసి రక్షణ ఇవ్వాలని పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. ఇండియాలో లవ్‌‌‌‌‌‌‌‌ జిహాద్‌‌‌‌‌‌‌‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.