జర్నలిస్టుల సంక్షేమ నిధికి అప్లై చేసుకోండి

జర్నలిస్టుల సంక్షేమ నిధికి అప్లై చేసుకోండి
  • మీడియా అకాడమీ చైర్మన్ ​అల్లం నారాయణ

హైదరాబాద్, వెలుగు: మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధ్రువీకరించి పంపాలన్నారు.  దరఖాస్తుతోపాటు జర్నలిస్టు డెత్, ఇన్​కమ్, ఫ్యామిలీ మెంబర్ సెర్టిఫికెట్లు, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలన్నారు. ప్రమాదం బారిన పడిన జర్నలిస్టు లేదా అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆర్థిక సాయంకోసం దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తుతోపాటు జర్నలిస్టు పని చేసే స్థితిలో లేడని ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలతో జిల్లా పౌర సంబంధాల అధికారి ధ్రువీకరణతో పంపాలన్నారు. 

ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ధరఖాస్తులు ఈ నెల 21వ తేదీలోపు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నెం.10-2-1, యఫ్.డ్.సి.కాంప్లెక్సు, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్ టాంక్, హైదరాబాదు–500 028లో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ అధికారి మొబైల్ నంబర్ 77025 26489 ను సంప్రదించాలని సూచించారు.