- నవంబర్ రెండో వారంలో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: గోదావరి బోర్డు మీటింగ్ వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన 18వ బోర్డు సమావేశాన్ని అనివార్య కారణాలతో బోర్డు వాయిదా వేసింది. ప్రస్తుత బోర్డు చైర్మన్ పద్మ దోర్జే గ్యాంబాని జలశక్తి శాఖ బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త చైర్మన్‌గా వినీత్ గుప్తాను నియమించింది. అయితే, ఆయన నవంబర్ 8 లేదా 9న బాధ్యతలు తీసుకుంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జరగాల్సిన మీటింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు బోర్డు మెంబర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వినీత్ గుప్తా బాధ్యతలు చేపట్టాక.. నవంబర్ రెండో వారంలో సమావేశాన్ని నిర్వహించే అవకాశాలున్నాయి.
