రేసీ స్ర్కీన్‌‌ప్లేతో రైల్వే కాలనీ

రేసీ స్ర్కీన్‌‌ప్లేతో రైల్వే కాలనీ

అల్లరి నరేష్​, కామాక్షి భాస్కర్ల  జంటగా నటించిన చిత్రం  ‘12 ఏ రైల్వే కాలనీ’.  ఎడిటర్ నాని కాసరగడ్డ  దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘పొలిమేర’ ఫేమ్  అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌‌‌‌గా వ్యవహరించాడు.  శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ  నవంబర్ 21న విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్​ మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు చాలా జానర్స్  చేశాను కానీ ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడూ చేయలేదు. 

ఫస్ట్ టైం ఇలాంటి జానర్  ట్రై చేస్తే బాగుంటుందనిపించింది. మల్టీ లేయర్స్ ఉన్న ఈ కథ చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉంటుంది. స్ర్కీన్‌‌ప్లే రేసీగా సాగుతూ  ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ హైలైట్‌‌గా నిలుస్తుంది’ అని అన్నాడు.  ఇది తన  కెరీర్‌‌‌‌లో బెంచ్ మార్క్ మూవీ అవుతుందని కామాక్షి భాస్కర్ల చెప్పింది. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని దర్శకుడు నాని అన్నాడు. 

షో రన్నర్ అనిల్ విశ్వనాథ్  మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్‌‌తో,  డిఫరెంట్ స్క్రీన్‌‌ప్లేతో  వస్తున్న సినిమా ఇది.  సస్పెన్స్ థ్రిల్లర్స్‌‌ని ఎంజాయ్ చేసే ఆడియెన్స్‌‌కి  మంచి ట్రీట్‌‌లా ఉంటుంది’ అని చెప్పాడు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి,  మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాల్గొన్నారు.