
బషీర్ బాగ్, వెలుగు: కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన పార్టీకే బీసీలు ఓటు వేయాలని ఆల్ ఇండియా ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రెసిడెంట్ ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. బీహార్ లో ప్రభుత్వం కుల గణన చేసి రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో వెంటనే కులగణన చేసి రిజర్వేషన్స్ పెంచాలని డిమాండ్ చేశారు.
గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. భారత్లో బీసీల కుల గణన చేపట్టాలని తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. అది అసాధ్యమని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కుల గణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే పార్టీని గెలిపించాలని కోరారు.
Also Read :- తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు..వెల్లడించిన వాతావరణ శాఖ