మహిళా, శిశు సంక్షేమానికి  రూ.26 వేల కోట్లు కేటాయింపు

 మహిళా, శిశు సంక్షేమానికి  రూ.26 వేల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు రూ.26వేల కోట్లు కేటాయించారు. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్​తో పోలిస్తే 2.52 శాతం నిధులు ఎక్కువగా అలాట్ చేశారు. రూ.26వేల కోట్లలో అత్యధికంగా సాక్షమ్ అంగన్​వాడీ, పోషణ్ 2.0 కింద ఉండే ఐసీడీఎస్, అంగన్​వాడీ సర్వీసెస్, పోషణ్ అభియాన్, యుక్త వయస్సు అమ్మాయిలకు సంబంధించిన స్కీమ్స్ కోసం రూ.21,200 కోట్లు కేటాయించారు.

మిషన్ శక్తి (మహిళల ప్రొటెక్షన్, సాధికారత) కోసం రూ.3145 కోట్లు అలాట్ చేశారు. మహిళలకు అన్ని హక్కులు పొందేలా చేయడం, వారికి రక్షణ కల్పించడం, ప్రభుత్వ పథకాల్లో వారిని భాగస్వాములను చేయడం మిషన్ శక్తి (సంబల్) లక్ష్యం. మిషన్ వత్సల్య స్కీమ్ (చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్) కోసం రూ.1,472 కోట్లు కేటాయించారు. చిన్నారులకు సేఫ్, సెక్యూర్ వాతావరణం కల్పించడమే మిషన్ వత్సల్య స్కీమ్ లక్ష్యం.