యుగతులసీ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తు కేటాయించండి : సీఈసీ

యుగతులసీ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తు కేటాయించండి : సీఈసీ

మునుగోడులో యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. గతంలో ఆయనకు ఈ గుర్తు కేటాయించి ఆ తర్వాత రద్దు చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది.  సీఈసీ ఆదేశాలతో శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆర్ఓ వివరణపై సాయంత్రంలోగా రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది.

యుగతులసీ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు.. రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. గుర్తుల కేటాయింపుల్లో భాగంగా శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రోడ్ రోలర్ గుర్తు మార్చి బేబీ వాకర్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల తీరుపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కేటాయించిన గుర్తును ఎలా మారుస్తారని ప్రశ్నించారు. హఠాత్తుగా గుర్తు మార్చడం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు శివకుమార్.