రాష్ట్రంలో 2,620 దుకాణాల కేటాయింపు.. ఆగస్టు 4 నుంచి అప్లికేషన్ల ప్రాసెస్

రాష్ట్రంలో 2,620 దుకాణాల కేటాయింపు.. ఆగస్టు 4 నుంచి అప్లికేషన్ల ప్రాసెస్

హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపును ఈ నెలలోనే పూర్తి చేసేందుకు ఆబ్కారీ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఎల్లుండి(4వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలున్నాయి. 2021లో టెండర్లు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ఫీజును రూ. 2 లక్షలు నిర్ణయించి స్వీకరించిన విషయం తెలిసిందే. 

ఈ సారి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నవంబర్‌లో జరగాల్సిన టెండర్లను ఎక్సైజ్ శాఖ మూడు నెలల ముందే టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ముందస్తుగానే చర్యలకు ఉపక్రమించిందనే ముందస్తుగా మద్యం దుకాణాల టెండర్లకు ఉపక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. 

అయితే స్కీములు నిధులు లేకపోవడంతో ఆదాయం కోసమే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరించి 19వ తేదీన లక్కీ డ్రా తీయనున్నారు. షాపుల కేటాయింపులో గతంలో మాదిరిగా ప్రభుత్వం గౌడ్ లు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించనుంది.